ఇంకా భూదాహం తీరలేదు..!

ఎన్నివేల ఎకరాలు దోచుకుంటారు..!
బలవంతంగా భూములు లాక్కొంటే చూస్తూ ఊరుకోం..!

హైదరాబాద్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్థసారథి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధాని ఏర్పాటులో ప్రభుత్వం భూదాహం ఇంకా తీరినట్టులేదు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని ప్రచారం చేసుకుంటూ...సాక్షాత్తు ముఖ్యమంత్రే బలవంతపు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించడం దుర్మార్గమన్నారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్ళిన రైతులతో ..భూములివ్వకపోతే  లా తీసుకోవాలో తమకు తెలుసంటూ చంద్రబాబు బెదిరించాడని ధ్వజమెత్తారు. 

వేధింపులు ఆపకపోతే..!
ఏముఖ్యమంత్రి అయినా బీడు భూములను ఏవిధంగా సాగులోకి తీసుకురావాలి అని ఆలోచించిస్తారని, చంద్రబాబు మాత్రం మూడు  పంటలు పండే భూములను ధ్వంసం చేసి, లాక్కొని బీడు భూములుగా మారుస్తున్నాడని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో ఇప్పటికే 80,90 వేల ఎకరాలు అన్యాయంగా దోచుకున్నారని నిప్పులు చెరిగారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ దీక్ష చేసినప్పుడు  ప్రభుత్వం వెనక్కి తగ్గిందని పార్థసారథి ఈసందర్భంగా గుర్తు చేశారు. ఇన్ని వేల ఎకరాలు తీసుకొని మళ్లీ భూముల పేరుతో రైతులను ఎందుకు వేధిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  

రైతులకు అండగా ఉంటాం..!
భూములివ్వని రైతులను బెదిరింపులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. 20 ఎకరాల్లో  కోతకు వచ్చిన చెరకు పంట తగలబెట్టారని, అంతకుముందు మోటార్లు , పంటలు నాశనం చేశారని పార్థసారథి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు ఎవరిపైనా కేసు పెట్టని చేతగాని ప్రభుత్వముందని ఫైరయ్యారు. పంట తగలబెట్టారని కేసు పెట్టేందుకు వెళ్లిన చంద్రశేఖర్ కుటుంబీకుల్ని...తగలబడిందని చెప్పమంటూ పోలీసులు వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. బలవంతపు భూసేకరణకు వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకమని..రైతులకు అండగా ఉంటామని పార్థసారథి స్పష్టం చేశారు. 
Back to Top