పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన పులివెందుల చేరుకున్నారు. స్థానికంగా ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశుపరిశోధన కేంద్రం (ఐజీ కార్ల్)ను ఆయన సందర్శిస్తారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అలాగే శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒంటిమిట్ట శ్రీ కోదండరాము స్వామివారిని వైఎస్ జగన్ దర్శించుకుంటారు.మధ్యాహ్నం 12 గంటలకు కమలాపురంలో జరిగే దర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత 3.00 గంటలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను వైఎస్ జగన్ సందర్శించనున్నారు. అనంతరం నక్కలపల్లె ఎస్ఎస్ ట్యాంకును పరిశీలించనున్నారు. శనివారం పులివెందులలోని క్యాంపు క్యారాలయంలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.