శ్రీకాళహస్తి ఆస్పత్రికి ఎంపీ ఫండ్స్

చిత్తూరుః వైయస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రోగుల ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా హాస్పిటల్ లో వసతులపై ఆరా తీశారు. హాస్పిటల్ లో బెడ్ షీట్స్, అంబులెన్స్, జనరేటర్ కొరత ఉందని తెలిపారు. హాస్పిటల్ లో కనీస వసతులపై సూపరిండెంట్ తో మాట్లాడనని, ఎంపీ నిధులను ఆస్పత్రికి కేటాయిస్తానని చెప్పారు. హాస్పిటల్ లో డయాలసిస్ భారీ ఎత్తున పెట్టినప్పటికీ ప్రైవేటు వారికి అప్పగించడం మూలాన అది మూతబడి ఎవరికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్స్ పేషెంట్స్ కి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కోరారు. ఆస్పత్రిని మరింతగా మెరుగపర్చడం కోసం జిల్లా మంత్రితో పాటు సంబంధిత హెల్త్ మినిస్టర్ తో మాట్లాడుతానని వరప్రసాద్ వారికి హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి ప్రజలకు మంచి జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. 

Back to Top