పార్టీ మారే యోచనలేదు: బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ

హైదరాబాద్: వైఎస్సార్సీపీకి నష్టం కలిగించే పని ఎప్పుడూ చేయనని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని విజయనగరం జిల్లా బొబ్బిలిఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. మంగళవారం విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో సుజయ్కృష్ణతో పాటు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, కోలగట్ల వీరభద్రస్వామి, పెనుమత్స సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు.  అనంతరం సుజయ్కృష్ణ మీడియాతో మాట్లాడారు.  పార్టీ బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు చెప్పారు. తాను టీడీపీ నేతలతో ఎప్పుడూ సంప్రదింపులు జరపలేదని వెల్లడించారు. తాను పార్టీ మారబోతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ వైఎస్సార్సీపీలో చేరినపుడు వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయానని సుజయ్కృష్ణ తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో సెక్షన్-30 అమలుపై వైఎస్ జగన్తో చర్చించినట్టు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు.
Back to Top