ప్రజల ప్రార్థనలతో కుట్రలు చేదించుకు వచ్చా

రాజమండ్రి, 13 నవంబర్ 2013:

అభిమానులు, ప్రజలందరి  ప్రార్థనలు, ఆత్మీయత, ఆ దేవుడి దీవెనలతో కుట్రలను చేదించుకుని మీ మధ్యకు రాగలిగానని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు,‌ కడప ఎంపీ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాజమండ్రిలోని కంబాలచెరువు జంక్షన్కు చేరుకున్న శ్రీ జగన్ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవల వివాహమైన జక్కంపూడి విజయలక్ష్మి కుమార్తె సింధు దంపతులను వారి ఇంటిలో ఆశీర్వదించారు. అనంతరం జంక్షన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న ‌ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. త్వరలో తాను కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సమైక్య శంఖారావాన్ని పూరిస్తానని శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు.

జననేత శ్రీ జగన్ కోసం ప్రజాభిమానం వెల్లువెత్తింది. దీనితో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత, కడప ఎంపీ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముందుకు వెళ్ళే పరిస్థితి లేకపోయింది. శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాజమండ్రి వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మధురపూడి విమానాశ్రయం వద్దకు తరలివచ్చారు. విమానాశ్రయం వద్ద శ్రీ జగన్ కు ఘన‌ంగా స్వాగతం పలికారు. శ్రీ జగన్ ను చూసేందుకు‌ అడుగడుగునా జనం తరలిరావడంతో విమానాశ్రయం నుంచి రాజమండ్రి వరకు ట్రాఫిక్ జాం అయి‌పోయింది. మధురపూడి విమానాశ్రయం నుంచి రాజమండ్రి పది కిలో మీటర్లు రావడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. మదురపూడి విమానాశ్రయం నుంచి రాజమండ్రి పది కిలో మీటర్ల వరకు దారి పొడవునా అభిమానులు జై జగన్ నినాదా‌లు హోరెత్తించారు. అభిమానుల తాకిడితో ఆయన కాన్వాయ్ ముందుకు కదలే పరిస్థితి‌ లేకపోయింది.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగం చివరలో జై తెలుగు తల్లి - జై సమైక్యాంధ్ర - జోహార్ వై‌యస్ఆర్ - జోహా‌ర్ జక్కంపూడి అని నినదించారు. శ్రీ‌ జగన్ చేసిన నినాదాలతో రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు కూడా జై జగన్, జై జగన్... అంటూ ‌పెద్దపెట్టున నినాదాలు చేశారు.

Back to Top