పోతర్లంక ఎత్తిపోతల్లో విపరీతమైన అవినీతి

పనులు 50 శాతం కూడా పూర్తి కాకుండానే ఓపెనింగ్‌ సిగ్గుచేటు
చంద్రబాబు అవినీతి బయటపడుతుందనే హౌస్‌ అరెస్టు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున

గుంటురు: పోతర్లంక ఎత్తిపోతల పథకంలో చంద్రబాబు సర్కార్‌ విపరీతమైన అవినీతికి పాల్పడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. తన అవినీతిని ఎక్కడ బయటపెడతానోనని తనను పోలీసుల చేత గృహ నిర్బంధం చేయించారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పోతర్లంక ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు ప్రారంభించనున్నారు. ఎత్తిపోతల పథకాన్ని మేరుగు నాగార్జున నిన్న పరిశీలించి లీకులు, అవకతవకలు బయటపెట్టారు. దీంతో సీఎం పర్యటన నేపథ్యంలో అవినీతి ఎక్కడ బయటపడుతోందనని మేరుగు నాగార్జునను హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. రూ. 50 కోట్లతో ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్నారని, 5 వేల ఎకరాలకు నీరు అందించే ఈ ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి చోటు చేసుకుందన్నారు. ఎత్తిపోతల పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. పంపులు బిగించలేదు, కనెక్షన్‌ లేవని చెప్పారు. 50 శాతం పనులు కూడా పూర్తి కాకుండా చంద్రబాబు పోతర్లంక ఎత్తిపోతల పథకాన్ని ప్రాంభించడం సిగ్గుచేటన్నారు. లంక గ్రామాల ఉసురు పోసుకోవడానికి టీడీపీ సిద్ధమవుతుందన్నారు. అధికారులు కూడా ఏం జరుగుతుందో తెలియకుండా చంద్రబాబు చెప్పిన దానికి తలకాయలు ఊపుతూ.. డూడూ బసవన్నల్లా ముందుకు పోతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు పక్షపాతిగా నిలబడి ఎత్తిపోతల పథకంలో ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయి.. ఏమేమి అవకతవకలు ఉన్నాయో బయటపెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులను మోసం చేస్తుందన్నారు. వ్యవస్థలను జేబుల్లో పెట్టుకొని పోలీసులతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నాడని ధ్వజమెత్తారు. 

తాజా వీడియోలు

Back to Top