బాధిత కుటుంబానికి సాయం

తూర్పుగోదావరి: ముక్కామల బీసీ కాలనీ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితురాలు రాయుడు వెంకటలక్ష్మికి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సాయం చేశారు. గురువారం బాధితురాలికి 25 కేజీల బియ్యం, నగదును అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కో– ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అగ్ని మాపక కేంద్రం తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగు మండలాలకు సంబంధించి దగ్గరగా అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వాహనం వచ్చేసరికి సర్వం కోల్పోతున్నారన్నారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాగవరపు నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎం.ఎం.శెట్టి, కొప్పిశెట్టి సాయిబాబు, దేవరపల్లి చినబాలయోగి, సుంకర రామకృష్ణ, నేతల నాగరాజు, బొంతు లక్ష్మినారాయణ, కడలి త్రిమూర్తులు, కూనపురెడ్డి వెంకట్రావు, అనిశెట్టి సత్యనారాయణ, మట్టపర్తి సత్యనారాయణ, వాసంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top