స్విస్ చాలెంజ్’ ముసుగులో భారీ కుంభకోణం

()రాజధాని అభివృద్ధి పేరుతో రాక్షస పాలన
()రైతుల భూములతో రియల్ వ్యాపారం

రాజధాని ప్రకటనకు ముందే లక్ష కోట్లు కొట్టేశారు... అందుకు ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ను ప్రయోగించారు.
ఇపుడు మరో లక్ష కోట్లు కొట్టేయబోతున్నారు. ఇందుకు‘స్విస్ ఛాలెంజ్’ను ప్రయోగిస్తున్నారు.
 
హైదరాబాద్: రాజధాని ఎక్కడ వస్తుందో ప్రకటించడానికి ముందు పేద రైతుల భూములు కొట్టేసి లక్ష కోట్ల మేర లబ్దిపొందిన సర్కారు పెద్దలు ఇపుడు ‘స్విస్ చాలెంజ్’ ముసుగులో మరో ఘరానా దోపిడీకి స్కెచ్ వేశారు. రైతుల నుంచి సమీకరించిన భూములను స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసి మరో లక్ష కోట్లు కొట్టేసే పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్ కేపిటల్)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కట్టబెట్టడానికి సింగపూర్ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనలోని మతలబులన్నీ ఇప్పటికే బట్టబయలయ్యాయి.

స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేనే లేదని సుప్రీం కోర్టు ఎప్పుడో తెగేసిచెప్పింది.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రోత్సహించవద్దని గతంలోనే కేల్కర్ కమిటీ ప్రతిపాదించింది. మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు.. ఆర్థిక నిపుణులు వారించినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. సింగపూర్ సంస్థలతో కలిసి దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న ప్రయత్నాలన్నిటినీ ప్రతిపక్ష వైయస్సార్సీపీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. తాజాగా స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ వ్యవహారశైలిని ఉమ్మడి హైకోర్టూ తప్పుబట్టింది. అయినా ఈ విధానంపై రాష్ర్ట ప్రభుత్వం ముందుకు పోవడం వెనుక లక్ష కోట్ల దోపిడీ ప్రణాళిక దాగి ఉంది.

పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే...
పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్‌ఎస్టేట్ వ్యాపారం ఇది. ప్రధాన రాజధాని కేంద్రంలో చేపట్టే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు కొట్టేయడానికి ప్రణాళిక రచించారు. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైనా అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలేవీ అక్కడ ఉండవు. కేవలం భూమిని అభివృద్ధి చేస్తారంతే. 1,691 ఎకరాల భూమిని చదును చేసి మౌలికసదుపాయాలన్నీ కల్పించి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. వాటిని సింగపూర్ కంపెనీలు పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.



తాజా వీడియోలు

Back to Top