పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

గుంటూరు: కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. శుక్రవారం గుంటూరు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొత్స, అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన పెచ్చరిల్లుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం విపరీతమైన దోపిడీకి పాల్పడుతూ.. రాష్ట్రాన్ని దోచుకుతింటుందని విమర్శించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలన మళ్లీ రావాలంటే ఆయన తనయుడు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Back to Top