గురువారంనాటి పాదయాత్ర సాగేదిలా..

గుంటూరు:

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్  జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం గురజాల నియోజకవర్గంలో సాగనుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కార్యక్రమాల సమన్వయకర్త  తలశిల రఘురామ్ తెలిపారు. గురజాల నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతంనుంచి జనపాడుకు చేరుకుని అక్కడకు 1.3 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి అనంతరం పిడుగురాళ్లకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు.

Back to Top