అతిసార బాధిత కుటుంబాలకు వైయస్‌ఆర్‌సీపీ చేయూత

గుంటూరు: అతిసార వ్యాధితో అకాల మరణం పొందిన బాధిత కుటుంబాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక చేయూతనందించారు. గురువారం పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అందజేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు బా«ధిత కుటుంబాలకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వ అసమర్థత వల్లే అతిసార మరణాలు సంభవిస్తున్నాయని మండిపడ్డారు. అతిసార బాధితులకు సకాలంలో వైద్యసేవలందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అతిసార కారణంగా చనిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందజేయాలని వారు డిమాండ్‌ చేశారు.
 
Back to Top