రాయచోటి నియోజకవర్గ పరిశీలకులుగా గూడూరు రవి

ఎర్రగుంట్ల: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయడంలో భాగంగా ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని పది నియోజకవర్గాలకు పరిశీలికులను నియమించారు. ఇందులో భాగంగానే రాయచోటి నియోజకవర్గనికి జిల్లా పరిషత్‌ చైర్మెన్‌గూడూరు రవి నియమితులయ్యారు. వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకంతో అప్పగించిన పనిని శక్తి వంచనతో నెరవేరుస్తానన్నారు. అలాగే నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయునున్నట్లు ఆయన చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top