ఎయిర్‌పోర్టులో పెద్దిరెడ్డికి ఘ‌న‌స్వాగ‌తం

విమానాశ్రయం(గన్నవరం): వైయ‌స్సార్ సీపీ కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. విజయవాడలో జరగనున్న పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన తిరుపతి నుండి బ‌య‌ల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో పెద్దిరెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, మాజీ కార్పొరేటర్ అడప శేషు, రాష్ట్ర ఆదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తుమ్మల చంద్రశేఖర్, అశోక్‌యాదవ్, మైనార్టీ సెల్‌రాష్ట్ర కార్యదర్శి ఎండీ. గౌసాని, బీసీసెల్ మండల అధ్యక్షులు జలసూత్రం రామ్మోహన్‌రావు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. 

Back to Top