మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం

ప్ర‌కాశంః రైతు పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్య‌క్షుడు సుబ్బారెడ్డి ధ్వజ‌మెత్తారు. రైతులు ఆరుగాలం శ్ర‌మించి పండించిన మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని కోరుతూ ఒంగోలు మార్కెట్ యార్డ్ ముందు గ‌ల ర‌హ‌దారిపై ఆందోళ‌న‌కు దిగారు. మిర్చి పంట‌ను రోడ్డుపై దహ‌నం చేసి నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో రైతులను ఆదునేకునేందుకు ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి ఏర్పాటు చేస్తామ‌ని చెప్పి ప్ర‌భుత్వం మోసం చేసింద‌న్నారు. అన్న‌పూర్ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా ఉన్న రాష్ట్రాన్నిచంద్ర‌బాబు ఆత్మ‌హ‌త్య‌ల రాష్ట్రంగా త‌యారు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.  ప్ర‌భుత్వం దిగివ‌చ్చి మిర్చిపంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. కార్య‌క్ర‌మంలో రైతులు, వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top