చంద్రబాబు వైఖరితోనే ప్రతికూలంగా బ్రిజేష్‌ తీర్పు

హైదరాబాద్ :

ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరి వల్లనే జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పు మన రాష్ట్రానికి ప్రతికూలంగా వచ్చిందని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావు విమర్శించారు. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు నాయుడు తన హయాంలో రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకపోవడం వల్లే కృష్ణా మిగులు జలాల విషయంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే మిగులు జలాలను మనం దక్కించుకోలేకపోయామని వారు విమర్శించారు.

హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై బురదజల్లేందుకు ప్రయత్నించడం ఆయన కుసంస్కారాన్ని తెలియజేస్తోందని నిప్పులు చెరిగారు. ఆల్మట్టి ఎత్తును పెంచుతున్నప్పుడు చంద్రబాబు ఎందుకు కళ్లు
మూసుకున్నారని పద్మ, గట్టు ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పాపాలను తమ
పార్టీపై రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వైయస్ఆర్ ప్రభుత్వం ట్రిబ్యున‌ల్‌లో వేసిన అఫిడవిట్లో ప్రాజె‌క్టుకు ఆటంకం కలగకూడదనే చట్టం చేయాలని కోరినట్లు తెలిపారు. ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా చంద్రబాబు పూర్తిచేయలేదని చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top