ప్రత్యేకహోదా వచ్చేవరకు పోరాటం

హైదరాబాద్ః రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం శీతాకాల సమావేశాల్లో పోరాడుతామని వైయస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. హోదా ముగిసిన అధ్యాయం అంటూ టీడీపీ, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రత్యేకహోదా వచ్చే వరకు వైయస్సార్సీపీ పోరాటం ఆగదని మరోసారి తేల్చిచెప్పారు. వైయస్ జగన్ అధ్యక్షతన లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

Back to Top