చేనేత సమస్యలపై పోరాటం చేయాలి

మంగళగిరి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి చేనేతరంగం ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేయాలని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి సూచించినట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి వెంకటనాగ మోహనరావు తెలిపారు. పార్టీ పదవి లభించిన అనంతరం తొలిసారిగా ఎంపీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా ఒంగోలులోని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ సుబ్బారెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పాడని తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో పట్టణ కన్వీనర్‌ మునగాల మల్లేశ్వరరావు, అనుబంధసంఘాల కన్వీనర్లు ఆకురాత్రి రాజేష్‌; షేక్‌ శ్రీను, ఊట్ల ప్రసాద్‌ తదితరులున్నారు.

తాజా ఫోటోలు

Back to Top