ఫీజు నేను కడతాను!

పత్తికొండ

11 నవంబర్ 2012 : "నాన్న లేడు. చనిపోయాడు. మా అమ్మ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాబ్ చేస్తుంది. రెండు వేల రూపాయల జీతం వస్తది. సరిపోవు. మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడుతోంది. మాకు చదువు కోవాలని ఉంది. షర్మిల అక్కని కలిసి సహాయం చేయమని అడగడానికి వచ్చాం..." -హృదయాన్ని కదిలించే ఇద్దరు చిన్నారుల ఆర్తి ఇది.
ఫ్యాక్షన్
గొడవల్లో తమ తండ్రి (హనుమంతు)ని చంపేశారనీ, ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే అమ్మ(అనసూయ)
ఇల్లు గడవక తమను స్కూలు మాన్పించిందనీ, తాము 'ఏ' గ్రేడ్
స్టూడెంట్లమనీ తమకు చదువుకోవాలని ఉందనీ పదేళ్ల రాశి చెప్పింది. పత్తికొండలో షర్మిల బస చేసిన క్యాంప్ దగ్గరకు ఆదివారం ఉదయమే రాశి, తన తమ్ముడు సురేంద్ర  వచ్చారు. షర్మిలక్కను కలవాలంటూ భద్రతాసిబ్బందికి చెప్పి అక్కడే వేచి ఉన్నారు.
రాశి తమకు చదువంటే చాలా ఇష్టమంది. "తమ్ముడు నాలుగో క్లాసు. బాగా చదువుతాడు. నేను కూడా బాగా చదువుతాను" అని కన్నీళ్ల పర్యంతమైంది. చదువుకుని ఏం కావాలనుకుంటున్నావని అడిగితే 'ఇంజనీరు' కావాలనుకుంటున్నానంది.
"మమ్మల్ని చదివిస్తే రుణపడివుంటాం. చదువంటే మాకు చాలా ఇష్టం" అంటూ వెక్కివెక్కి ఏడ్వసాగింది.
పుట్టపర్తి నియోజకవర్గం పార్టీ నేత డాక్టర్ హరికృష్ణ వారిద్దరిని షర్మిల వద్దకు తీసుకెళ్లారు. వారి కన్నీటి కథ విని షర్మిల చలించి పోయారు.
"మీ ఫీజు నేను కడతాను. ఎందుకు నానా ఏడుస్తున్నావ్ బంగారూ! నేను చూసుకుంటాను కదా! " అంటూ ఆప్యాయంగా ముద్దాడారు. పాఠశాల చదువు అయిపోయేంత వరకు చదివించే బాధ్యత తనదేనని షర్మిల హామీ
ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పత్తికొండ నియోజకవర్గం నాయకులు నాగరత్నమ్మ,
రామచంద్రారెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గం నాయకుడు హరికృష్ణ ఆ పిల్లల బాధ్యత
తాము తీసుకుంటామని చెప్పారు.
''మాట ఇచ్చాను. తప్పొద్దన్నా'' అంటూ షర్మిల ఆ
పిల్లలను వారికి అప్పగించారు. నాగరత్నమ్మ పాప రాశిని కస్తూరిబా పాఠశాలలో
చేర్పించే ఏర్పాటు చేయగా, డాక్టర్ హరికృష్ణ బాబు పాఠశాలకు నెలనెలా ఫీజు
చెల్లించేందుకు హామీ ఇచ్చారు.

Back to Top