రైతులకు అండగా ఉంటాం


వినుకొండలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
అన్నదాతల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు
గుంటూరు: రైతులకు సాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేస్తే సహించేది లేదని, వారికి అండగా ఉంటామని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, శ్రీకృష్ణదేవరాయులు, బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. పంటల సాగుకు నీటిని విడుదల చేయాలని డిమాండు చేస్తూ వినుకొండలో శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. గుంటూరు–కర్నూలు రహదారిపై ధర్నా చేపట్టారు. 11 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపింది. తమ పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండు చేశారు. పార్టీ నాయకులు అంబటి రాంబాబు, శ్రీకృష్ణదేవరాయులు, బ్రహ్మనాయుడు, తదితరులు రైతుల నిరసన ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పల్నాడు ప్రాంతంలో నాలుగేళ్లుగా కౌలుకు తీసుకునేందుకు రైతులు వెనుకాడుతున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఆర్భాటాలు చేయడం తప్ప రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదన్నారు. రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వారానికి ఒకసారి నీరు ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. ఎప్పుడు నీరిస్తారో చెప్పడం లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటామని, రైట్‌ కెనాల్‌ నుంచి నీటిని ఇచ్చి తోడుగా ఉంటామన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top