<strong>సర్కార్ తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ వాకౌట్</strong>ఏపీ అసెంబ్లీ: రాష్ట్రంలో ఉపాధి లేక వ్యవసాయ కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తు బిక్షాటన చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు సభలో వైయస్ జగన్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద లేబర్ కాంపొనెంట్‌కే 97.5 శాతం నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉపాధి లేక కూలీలు కేరళకు పోయ్యే పరిస్థితి, కర్నాటక, చెన్నైకి వెళ్తున్నారు. ఇక్కడేమో అంగన్‌వాడీ భవనాలకు, పంచాయతీ భవనాలకు, సిమెంట్ రోడ్లకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు మంజూరు చేస్తున్నారు. చివరకు శ్మాశానాలకు కూడా ఈ నిధులు కేటాయిస్తున్నారు. లేబర్ కాంపొనెంట్‌కు డబ్బులు ఇవ్వకపోతే వలసలు పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకన్న దారుణం ఉంటుందా? మెటీరియల్ కాంపొనెంట్ ఎక్కువగా పెట్టాం కాబట్టి మాకు అవార్డులు వచ్చాయని చెప్పడం ధర్మమేనా? కేరళలో అన్నదాతల బిక్షాటన చేస్తున్నారు. దీన్ని గుర్తించిన కేరళ ప్రభుత్వం మన కార్మికులకు పరిహారం చెల్లిస్తోంది.సిమెంట్ రోడ్లు వేయొద్దని, బిల్డింగ్‌లు కట్టొద్దని ఎవరు చెప్పడం లేదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా మీరు పట్టించుకోవాన్ని నిరసిస్తూ మేం సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం.