వైయస్‌ జగన్‌పై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలి

తూర్పుగోదావరి(గోకవరం): టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ట్రావెల్‌ బస్సు ప్రమాద మృతులను పరామర్శించేందుకు వెళ్లిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని గోకవరం వైయస్‌ఆర్‌ సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. పార్టీ పిలుపు మేరకు గురువారం గోకవరం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరసాల ప్రసాద్‌ మాట్లాడుతూ దివాకర్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని అడిగినందుకు ప్రభుత్వం అన్యాయంగా ఆయనపై తప్పుడు కేసులు పెట్టిందన్నారు. ఇది చాలా సిగ్గుచేటని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, ఈ ఘటనపై న్యాయవిచారణ జరపాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమన్యాన్ని కఠినంగా శిక్షించాలని, వైయస్‌ జగన్‌పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ పివివి గోపాలకృష్ణకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు క్రరి సూరారెడ్డి, జిల్లా కార్యదర్శి నరాలశెట్టి నర్శయ్య, ముత్యం నాని, కోండ్రపు అప్పారావు, పోశిన రాజియ్యదొర, దాకారపు ధర్మరాజు, తొట్టా సత్యన్నారాయణ, ఎంపీటీసీ నల్లల వెంకన్నబాబు, ఎలుగుబంటి దుర్గ, మొగలి గొల్లబాబు, దామరాజు వీరాంజనేయులు, కసిరెడ్డి చంటిబాబు, టి.కన్నబాబు, మైపాల పాండు, దోసపాటి సూరిబాబు, దాసరి చినధర్మరాజు, మాగాపు కొండలరావు, చారి, బాడితబోయిన అబ్బులు, తోట విష్ణు, శేషయ్య, సునీల్, రాజేష్, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top