మంత్రి ఇలాకలో నకిలీ విత్తనాలు

గుంటూరు: న‌కిలీ విత్త‌నాలు వ‌ల్ల పంట‌లు న‌ష్ట‌పోయిన రైతుల‌ను అధికార ప్ర‌భుత్వం వెంట‌నే ఆదుకోవాలని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే, కోన రఘుపతి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశం వాడివేడిగా సాగింది. ఈ సంద‌ర్భంగా వారు విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ... వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే న‌కిలీ విత్త‌నాలు విక్ర‌యిస్తుంటే మంత్రి పుల్లారావుకు క‌న‌బ‌డ‌డం లేదా అని వారు ప్ర‌శ్నించారు.  ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.  న‌కిలీ విత్త‌నాల‌ విక్ర‌యాల‌ను తక్షణమే నిలిపేయాలన్నారు. 
Back to Top