బరితెగించిన పచ్చ రాజకీయం

గుంటూరు : రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తూ  తెలుగుదేశం నేతలు దాడులకు తెగబడుతున్నారు. అమరావతి సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై వైయస్సార్ సీపీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ ... ఆదివారం జరిపిన పర్యటన విజయవంతమైంది. దీన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు  కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే  అమరావతి మండలం నరుకుళ్లపాడులో  టీడీపీ నేతలు ఆరుగురు వైయస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. టీడీపీ గూండాయిజాన్ని వైయస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తుందని మండిపడుతున్నారు.  

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడి గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని భంగపరుస్తున్నారని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు మండి పడ్డారు.  పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన విజయవంతమైందనే అక్కసుతో గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడి తమ పార్టీ కార్యకర్తలపై దాడిచేశారని, టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతుందని మండిపడ్డారు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.

Back to Top