ఎక్సుగ్రేషియా వ‌స్తుందా..!



ఆంథ్రప్రదేశ్ రాజమండ్రి గోదావరి పుష్కరాలలో 30 మంది దాకా మరణించారని ప్రస్తుత సమాచారం..మరణించిన మ్రుతుల కుటుంబాలకు 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు చంద్రబాబు గారు.. ఇక్కడ వివరణ ఇవ్వవలసిన అవసరం ఎంతయినా వుంది.. మరణించిన ప్రతి మ్రుతునికి 10లక్షలు ఇస్తారా..!! లేక ఎంతమంది మరణించినా వారు ఒకే కుటుంబానికి చెందినవారయితే 10 లక్షలు మాత్రమే ఇస్తారా..!! అలాగే వారికి 'ఆధార్ కార్డు వుండాలి.. 'బి.పి.ఎల్ కార్డు వుండాలి..'తెలుపు రేషన్ కార్డు వుండాలి.. 'ఓటరుకార్డు వుండాలి..అనే నిభందనలు ప్రవేశపెడతారా...ఎందుకంటే ఇప్పటికే రైతురుణ మాఫీలు ' ద్వాక్రా రుణ మాఫీలు విషయంలో ఇలాంటి వెటకారాలు పెట్టి మోసం చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రం లో ఇచ్చిన హామీలు అని ఏరు దాటించేశారు క‌దా..!  ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందా అని కొంద‌రికి అనుమానం వ‌స్తోంది.
ఇక ధ‌వళేశ్వ‌రం ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు కూడా ఇలాగే మృతుల కుటుంబాల‌కు రూ.2ల‌క్ష‌ల చొప్పున ఎక్సుగ్రేషియా ప్ర‌క‌టించారు. తీరా చూస్తే 3వారాలైనా ఇవ్వ‌నేలేదు. చివ‌ర‌కు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ వెళ్లి వాళ్ల‌ను ఓదార్చి అల్టిమేట‌మ్ జారీ చేస్తే కానీ క‌ద‌ల్లేదు. ఎలాగైనా బీద‌ల డ‌బ్బులు ఎగ్గొట్ట‌డంలో ఈ ప్ర‌భుత్వం ఎక్సు ప‌ర్ట్ క‌దా అందుక‌ని ఈ అనుమానాలు..!

Back to Top