ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలి

నాతవరం: మారుమూల గ్రామాల్లో సైతం పార్టీని మరింత అబివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం కన్వీనర్ పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. మండల కేంద్రంలోమండల శాఖ అద్యక్షుడు అంకంరెడ్డి జమీలు అద్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా మండలంలో పార్టీ స్థితిగతులపై, అధికార పార్టీ నాయ‌కులు వ్యవహరిస్తున్న నియంత విధానంపై జమీలు తెలియ‌జేశారు. తర్వాత మాజీ సర్పంచ్ ముత్తా శివాజీ ఉపాధి హమీ పధకంలో పని చేసిన కూలీలకు నెలలు తరబడి కూలీ డబ్బులు ఇవ్వలేదని మండలంలో ప్రతి గ్రామంలో ఈసమస్య ఉందన్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన కనీసం పట్టించుకోలేదని దీనిని పార్టీ నాయ‌కులు జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్తె పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.  ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.... ఈ సమస్యను మండల శాఖ నాయకత్వం ఆధ్వ‌ర్యంలో మండల స్ధాయి అధికారులకు దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అప్పుడు న్యాయం జరగకపోతే నర్సీపట్నం ఆర్డీవో కలెక్టరు దృష్టికి తీసుకెళ్లి పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్రకటించిన నవరత్నాలపై ప్రజలు నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని ఈనెల 11వ గడువు పెంచారన్నారు. ఇంకా ఎవ్వరైన ఈకార్యక్రమాన్ని పూర్తి చేయకపోతే యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే  ఎన్నికలో స్ధానిక సంస్దల్లో అభ్యర్ధులను గెలిపించుకునే దిశగా పని చేయాలన్నారు.ప్రస్తుతం చంద్రబాబునాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. దానిని మన పార్టీవైపు తిప్పుకునే విధంగా క్షేత్ర స్ధాయిలో పని చేయాలన్నారు.  అనంతరం మండలంలో కొత్తగా నియమించిన కమిటీలకు నాయుకుల పేర్లను గణేష్ ప్రకటించారు. ఈకార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి శిరుసుపల్లి నర్సింగరావు జిల్లా కమిటి సభ్యులు శెట్టి నూకరాజు సబ్బవవరపు వెంకునాయుడు (మునసీబు) మాకిరెడ్డి వెంకటరమణ, ముత్తా శివాజీ , అంకంరెడ్డి నానిబాబు, సర్పంచులు ఉలబాల శ్రీనువాస్ సాగిన లక్ష్మణమూర్తి పార్టీ నాయుకులు కార్యకర్తలు నాయుకులు పాల్గొన్నారు.

Back to Top