ఎన్నికలు ఎప్పుడొచ్చినా 200 సీట్లు ఖాయం

తిరుపతి:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడని ఆ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. శ్రీ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో  శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి రెండు వందలకు పైగా సీట్లు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు 150కి పైగా సీట్లలో డిపాజిట్లు కోల్పోతాయని కూడా చెప్పారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో ఉంచారని ఆయన పేర్కొన్నారు. ఏనాడూ సెక్రటేరియేట్‌కు వెళ్ళని జగన్ అవినీతికి ఎలా పాల్పడతారన్నారు. ఇలా ఉండగా, ఏ కేసుతో సంబంధం లేని శ్రీ జగన్మోహన్ రెడ్డిని కుట్ర చేసి జైలులో పెట్టారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. మీకోసం వస్తున్నా పాదయాత్రలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హామీలను నెరవేర్చడానికి దేశ బడ్జెట్ సరిపోదని ఆయన ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top