ప్ర‌త్యేక హోదాతోనే ఉద్యోగాలుః వైయస్ జగన్

అనంత‌పురం

: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా వ‌స్తేను యువ‌త‌కు ఉద్యోగాలు, ఉపాధి అవ‌కాశాలు క‌లుగుతాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. అనంత‌పురం జిల్లాలో ఏర్పాటు చేసిన యువ‌భేరి కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌త్యేక హోదా అవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన అనంత‌పురం జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్ర‌త్యేక హోదా ఎంతో దోహ‌దం చేస్తుంద‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు మాట త‌ప్పార‌ని ఫైర్ అయ్యారు. ప్ర‌త్యేక హోదా అయిపోయిన అంశం అని చంద్ర‌బాబు అంటున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. జీఎస్టీ యాక్ట్ లో ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. హోదా సాధ‌న‌కు అంద‌రం ఒక్క‌టై పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన వాగ్ధానాలు, పార్ల‌మెంట్‌లో బీజేపీ నాయ‌కులు చేసిన డిమాండ్ల‌ను వీడియో రూపంలో విద్యార్థుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ చూపించారు.

Back to Top