ప్రత్యేక హోదాతోనే ఉపాధి అవకాశాలు

చిత్తూరు : ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెరుకువారిపల్లె సర్పంచ్, వైయస్‌ఆర్‌సీపీ మండల నాయకుడు రెడ్డెప్పరెడ్డి అన్నారు. బుధవారం ఎ్రరావారిపాళెం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదావస్తే రైతులుకు రుణమాఫీ, రుణాలు మంజూరు, వ్యవసాయ రంగానికి నిధులు, పరిశ్రమలు వస్తాయన్నారు. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అలాగే పెద్ద యేత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు వచ్చేందుకు మంచి అవకాశం ఉంటుందన్నారు. వైయస్‌ జగనన్న చేపట్టే ప్రతి ఉద్యమానికి మండల ప్రజలు సహకారం ఉంటుందన్నారు. చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్దం అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వెంకటశిద్దులు, శివ,రమణారెడ్డి, మహేశ్వర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top