దోపిడి రాజ్యం..దొంగల రాజ్యం

ఏపీ అసెంబ్లీ: రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమాలపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు సోమవారం సభలో ఆందోళన చేపట్టారు. దోపిడి రాజ్యం..దొంగల రాజ్యం అంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. ఐపీఎస్‌ అధికారిపై జరిగిన దాడి ఘటనపై చర్చించాలని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు కోరినా స్పీకర్‌ వినిపించుకోకుండా వివిధ బిల్లులపై అధికార పక్షం సభ్యులతో మాట్లాడించారు. ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబడుతూ స్పీకర్‌ పోడియాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. అధికారులపై దాడిని నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉదయం అసెంబ్లీ ఆవరణలో శాంతియుతంగా దీక్ష చేపట్టగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఆరు గంటల పాటు మంగళగిరి పోలీసు స్టేషన్‌లో నిర్భందించారు. చెవిరెడ్డి అరెస్టును నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ టీడీపీ తీరును ఎండగట్టారు.

Back to Top