ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దు

వైయస్‌ జగన్‌ నాయకత్వంలో హోదా సాధిస్తాం
సుధాకర్‌ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తిప్పారెడ్డి

చిత్తూరు: ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్‌ కుటుంబాన్ని మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తిప్పారెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి చెరో రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు మదనపల్లెలో చేపట్టిన బంద్‌లో మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే హోదా వస్తుందన్నారు. ఆత్మహత్యలకు ఎవరూ పాల్పడవద్దన్నారు.  వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఉండడంలో సుధాకర్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాలేకపోయారని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తమను పంపించారన్నారు. చంద్రబాబు కంటితుడుపు చర్యగా రూ. 5, 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, రూ. 25 లక్షలు ఇచ్చి వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే సుధాకర్‌ మృతిచెందారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కళ్లు తెరిచి పోరాడాలన్నారు
Back to Top