దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా తండ్రీకొడుకుల వ్యాఖ్యలు

హైదరాబాద్‌: చంద్రబాబు, లోకేష్‌ అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాదరావు అన్నారు. నాలుగేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం అమలు చేయకుండా రూ. నాలుగున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు, లోకేష్‌ అవినీతిని ఆధారాలతో సహా రాష్ట్రపతికి అందజేశామన్నారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వరప్రసాదరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఒక్క మంచి కార్యక్రమమైనా చంద్రబాబు చేశారేమో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. 
Back to Top