చమన్‌ మృతిపై సమగ్ర విచారణ జరపాలి

అనంతపురం: టీడీపీ నేత చమన్‌ మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చమన్‌ మృతిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. రాప్తాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చమన్‌ మృతి చెందిన రెండ్రోజులకే ఆయన డ్రైవర్‌ నూర్‌బాషా ప్రమాదంలో మరణించడం వివాదస్పదంగా మారిందన్నారు. చమన్‌ డ్రైవర్‌ను ఢీకొట్టిన కారును ఇప్పటికీ పోలీసులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. చమన్, పరిటాల కుటుంబం మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని, చమన్‌ మృతదేహానికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top