పంటనష్టం వెంటనే చెల్లించాలి

హైదరాబాద్‌: రైతులకు పంటనష్టం బకాయిలు వెంటనే చెల్లించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రైతులతో కలిసి మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. కొన్నేళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌ బకాయిలు చెల్లించడం లేదని, పంటనష్ట పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top