ఫిరాయింపుదార్లు తప్పుకొంటే మేలు..మాజీమంత్రి పెద్దిరెడ్డి

కర్నూలు) పార్టీ మారిన
ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని
మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సూచించారు. కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి
మహా సమాధిని దర్శించుకొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 30
కోట్ల పెట్టి ఎమ్మెల్యేలను కొనటం గొప్ప కాదని, ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలతో రాజీనామా
చేయించాలని డిమాండ్ చేశారు. అభివ్రద్దిని చూసి టీడీపీలోకి వస్తున్నారని చెప్పటం
హాస్యాస్పదం అని పెద్దిరెడ్డి అభివర్ణించారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి,
ఎమ్మెల్యే లను కొనడమే పనిగా పెట్టుకొన్నారని విమర్శించారు. 

Back to Top