<strong>మైలవరం (కృష్ణాజిల్లా)</strong>, 10 నవంబర్ 2012: మైలవరం నియోజకవర్గంలో నీలం తుపానుకు దెబ్బతిన్న పంటలను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, మైలవరం నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి జ్యేష్ఠ రమేష్‌బాబు పరిశీలించారు. గడప గడపకూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా వారు శనివారంనాడు మైలవరం మండలం కొత్తగూడెంలో పంటలను పరిశీలించారు.