ప్రతిక్షణం ప్రజాహితమే- వ‌ర్షంలోనే వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
- అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

పశ్చిమ గోదావరి : వైయ‌స్ఆర్  సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టినప్రజాసంకల్ప పాదయాత్ర మండుటెండలోనూ, వ‌ర్షంలోనూ అప్రతిహతంగా సాగిపోతోంది. ఆయన వేసే ప్రతి అడుగూ.. ప్రజాశ్రేయస్సుకు పునాదిగా.. ప్రతిబాట.. జనక్షేమానికి పరిచిన పూలదారిగా.. కదిలిపోతోంది. ప్రతిక్షణం ప్రజాహితమే లక్ష్యమని నిరూపిస్తోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా జనహితునికి అభిమానులు నీరాజనాలు పలికారు. ప్రజాభిమాని వైయ‌స్‌ జగన్‌ అంటూ నినదిస్తున్నారు.  వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రకు బయలుదేరారు. ఆయన వెంట నడిచేందుకు వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు.

తణుకు శివారు నుంచి పాదయాత్ర నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఉండ్రాజవరం మండలం పాలంగి, ఉండ్రాజవరం మీదుగా చిలకపాడు క్రాస్‌ రోడ్డు చేరుకున్న తర్వాత వైయ‌స్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత మోర్తా, దమ్మెన్ను మీదుగా నడిపల్లి కోట చేరుకున్న తర్వాత ఈరోజు పాదయాత్ర ముగుస్తోంది. జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు.
Back to Top