అవాస్తవ కథనాలతో కుట్రలు చేస్తున్నారు

శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి తనను వేరు చేయడానికి కొన్ని పత్రికల యాజమాన్యాలు కుట్ర పన్నుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. అవాస్తవ కథనాలతో వైయస్‌ఆర్‌సీపీని బలహీన పర్చాలనుకుంటున్నారని మండిపడ్డారు.

వైయస్‌ఆర్‌ వల్లే బీసీలు అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి జరిగిందని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ.. శ్రీకాకుళం జిల్లాకు ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత పథకాన్ని ఇవ్వలేదని ధర్మాన విమర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top