టీడీపీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభం

  • నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఓటమి ఖాయం
  • టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలి
  • వైయస్‌ఆర్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌
విజయవాడ: తెలుగు దేశం పార్టీకి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఓటమి ఖాయమని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ జగన్‌ పై ఆరోపణలు చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ ప్రశ్నలకు ఏ విధమైన సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగుతున్నారు. ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఆరు హామీలు కూడా అమలు చేయడం లేదు. నంద్యాలలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. అక్కడ అందరూ వైయస్‌ జగన్‌ నాయకత్వం రావాలని కోరుతున్నారు. అక్కడ వార్డుకో మంత్రి, ఎమ్మెల్యేలు తిరుగుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చక్రపాణిరెడ్డి స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనామా చేసి మా పార్టీలోకి వచ్చారు. మీ పార్టీలోకి వచ్చిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చి వారితో వైయస్‌ జగన్‌ను తిట్టిస్తారా? అంటూ చంద్రబాబుపై వెల్లంపల్లి ఫైర్ అయ్యారు.  కేశవరెడ్డి బాధితులకు ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయడం లేదు. బాబుకు సిగ్గు, శరం ఉంటే 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని వెల్లంపల్లి అన్నారు. బీకామ్‌లో ఫిజిక్స్‌ చేసిన వ్యక్తి కూడా వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని  వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఖండించారు.
–––––––––––––––––––––––––––––––––––
వ్యక్తిగత ఆరోపణలకు ఫుల్‌ స్టాఫ్‌ పెట్టండి
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: టీడీపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. నంద్యాల బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగాన్ని చూసి టీడీపీ నేతలు భయపడిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. రెండు రోజులుగా టీడీపీ చోటామోటా నాయకులు అవాకులు, చవాకులు పేల్చుతున్నారని ఫైర్‌ అయ్యారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైయస్‌ జగన్‌ మాట్లాడిన ఒక్క మాటను పట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని టీడీపీపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని వైయస్‌ జగన్‌ అన్నారన్నారు. వైయస్‌ జగన్‌ బహిరంగ సభలోని పూర్తి ఉపన్యాసంపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే పాతరేస్తామన్నారు. అంతు చూస్తామన్నారు. టీడీపీ నేతల భాష ఏవిధంగా ఉందో అందరికి తెలుసునన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు.  వ్యక్తిగత ఆరోపణలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని టీడీపీ నేతలను హెచ్చరించారు. నంద్యాలలో వైయస్‌ఆర్‌సీపీ విజయం ఖాయమని తెలిసిన తరువాత టీడీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పదవికి చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. దాని గురించి మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో అప్రజస్వామిక,  అరాచక పాలనపై విమర్శలు చేస్తే అధికార పార్టీ నేతలు రోడ్డుపై దిష్టిబొమ్మలు కాల్చుతారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యమని విష్ణు ప్రశ్నించారు.

Back to Top