జేసీ నోరు అదుపులో పెట్టుకో

వైయస్ఆర్ కడపః టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారహీనంగా రౌడీలా, గూండాలా మాట్లాడితే ప్రజలే ఆయన నాలుక కోస్తారని  శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. పైడిపాలెం సభలో జేసీ వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.  రాయలసీమలో ఫ్యాక్షన్‌ కక్షలకు ఆజ్యంపోసి, రక్తపాతం సృష్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జేసీని చూసి ప్రతీ ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని జేసీకి హితవు పలికారు. 

Back to Top