చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేస్తానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జె.డబ్ల్యుసి) కు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆర్ కండ్రిగా గ్రామంలో వైయస్ జగన్‌ను కలిశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో 2005వ సంవత్సరం నుంచి పనిచేస్తున్నామని కాంట్రాక్టు ఉద్యోగులు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు కనీస వేతనం రూ. 8 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.31,500 ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని, మీరే ఆదుకోవాలని వారు వైయస్ జగన్‌ను కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైయస్ జగన్ హామీతో కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.