<br/><strong>- జననేతను కలుస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు</strong><strong>- అందరిలోనూ అభద్రతాభావమే</strong><strong>- అండగా ఉంటానని జననేత హామీ</strong>విజయనగరం: దాదాపు ఏడాది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. టీడీపీ పాలనలో ఉద్యోగ భద్రత కరువైందని వాపోతున్నారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు వైయస్ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సంక్షేమ పాలన అందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విద్యుత్ శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఇరవై సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న తమకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి రెగ్యులర్ చేయాలని కోరారు. - ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గ్రామీణ విలేకరులు కలిసి వినతిపత్రం అందజేశారు. పెన్షన్ స్కీం అమలు చేయాలని వారు జననేతను కోరారు. - ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆర్ట్ క్రాప్ట్ టీచర్లు వైయస్ జగన్‌ను కలిశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ మేరకు ప్రతిపక్ష నేతకు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మేలు చేస్తామని మాట ఇచ్చారు. - వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజా సంకల్ప యాత్రలో సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిశారు. 2003 నుంచి పని చేస్తున్నా జీతాలు పెరగడం లేదన్నా అని మొరపెట్టుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ మేరకు ప్రతిపక్ష నేతకు వినతిపత్రం అందజేశారు. - పార్వతీపురం డివిజన్‌కు చెందిన క్రేషి వర్కర్లు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. - ప్రజా సంకల్ప యాత్రలో వైద్య, ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు వైయస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు జననేతకు మొరపెట్టుకున్నారు. వారికి అండగా ఉంటానని వైయస్ జగన్ భరోసా కల్పించారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే అందరికీ మేలు చేస్తానని మాట ఇస్తున్నారు. జననేత హామీతో కాంట్రాక్టు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తామంతా జగనన్న వెంటే అంటూ నినదిస్తున్నారు.