() రాజ్యాంగ విలువలకు పాతరేస్తున్న పచ్చ ప్రభుత్వం() స్పీకర్ తొలగింపు అంశం మీద రాజ్యాంగం చెబుతున్నా పట్టించుకోరా() ప్రభుత్వాన్ని నిలదీసిన జన నేత వైఎస్ జగన్హైదరాబాద్) శాసనసభ కార్యకలాపాల్లో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రాజ్యాంగంలోని 179(సీ) స్పీకర్ తొలగింపు విధానాల్ని స్పష్టంగా చెబుతోందని ఆయన వివరించారు. 14 రోజుల వ్యవధిని పాటించాలని రాజ్యాంగం చెబుతోందన్న అంశాన్ని జన నేత కోట్ చేశారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జోక్యం చేసుకొన్నారు.హుందాగా వ్యవహరించాం..! అసెంబ్లీ లో చర్చ సందర్బంగా విప్ జారీ గురించి మాట్లాడితే..అందుకోసమే అవిశ్వాస తీర్మానం తెచ్చాం అన్నట్లుగా వక్రీకరించారు. విధాన ప్రక్రియలో భాగంగా విప్ జారీ చేయాల్సి ఉంటే, దాన్ని అడ్డుకొంటున్న విధానం అన్యాయంగా అనిపించటం లేదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. స్పీకర్ గా కోడెల శివప్రసాద్ ఎన్నిక సమయంలో నేను అన్న మాటలను బీజేపీ సభ్యులు ఉదహరించారు. ఆ మాటల్ని మేం అంగీకరిస్తున్నాం. అప్పుడు మేం ఆయన మీద నమ్మకం ఉంచాం కాబట్టి అంత గౌరవంగా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాం. కానీ ఆయన స్పీకర్ గా ప్రవర్తించటం లేదు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. అంత గౌరవంగా మేం స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే ఆయన ప్రవర్తన మాత్రం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.తప్పుడు మార్గాలు..! ఇతర పార్టీల బీ ఫామ్ ల నుంచి గెలిచిన వారిని ప్రలోభాలకు గురి చేసి, కొనుగోలు చేస్తున్నారు. వారిని అనర్హులుగా గుర్తించి వేటు వేయాల్సిన స్థానంలో ఉండి... ఆ పని చేయటం లేదు. విప్ జారీ చేసే విషయంలోనూ దారుణంగా వ్యవహరించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం కు సంబంధించి తేదీ నిర్ణయించి ప్రకటిస్తే మేం విప్ జారీ చేసి ఉండేవాళ్లం, ఓటింగ్ జరిగి ఉండేది. కానీ అలా జరగనివ్వలేదని వైఎస్ జగన్ వివరించారు. ప్రగతిని చూసి పార్టీలు మారుతున్నారని చెబుతున్నారని, అటువంటప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా ఎక్కడ ఉన్నారని, ఎందుకు ఓటు వేయటం లేదని ప్రశ్నించారు. ఆ సభ్యుల చేత రాజీనామా చేయించి ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికలకు పోయే ధైర్యం చంద్రబాబుకి లేదని వైఎస్ జగన్ అన్నారు. రాజ్యాంగాన్ని పట్టించుకోరా..!ప్రతిపక్ష నేతగా నేను మాట్లాడుతుంటే అధికార పక్షం నుంచి 3 లేక 5 నిముషాలకు ఒకసారి అంతరాయం కల్గిస్తారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అటువంటివి కనీసం ఆపే ప్రయత్నాలు కూడా చేయరని చెప్పారు. నిబంధనావళి 340 (2) ప్రకారం రూల్ ను అధిగమించి ఎమ్మెల్యే రోజా ను సస్పెండ్ చేయటం జరిగింది. ఈ విషయం మీద జవాబు చెప్పటం లేదని వైఎస్ జగన్ వివరించారు. అటు రూల్ 71 ను సస్పెండ్ చేస్తూ అధికారం లేకపోయినా నిర్ణయం తీసుకొన్నారని చెప్పారు. అసలు ఇవన్నీ రాజ్యాంగంలోని 179(సీ) అధికరణ కిందకు వస్తాయని వైఎస్ జగన్ చెప్పారు. అందులో స్పీకర్ తొలగింపు అంశం ఎలా చేపట్టాలో రాసి ఉందని చదివి వినిపించారు. 14 రోజుల వ్యవధి ఉండాలన్న నిబంధనను కోట్ చేశారు. తర్వాత 208 అధికరణ కింద ఆయా శాసనసభ ల వ్యవహారాలు నిబంధనావళి ప్రకారం సాగాలని, అదే సమయంలో రాజ్యాంగానికి లోబడి ఉండాలని గుర్తు చేశారు. అటువంటప్పుడు రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిని తుంగలోకి తొక్కి స్పీకర్ గా కోడెల శివప్రసాద్ రావు వ్యవహరించారని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు.