పతాకస్థాయికి కాంగ్రెస్, టిడిపి డ్రామాలు

హైదరాబాద్ :

ఒక పక్క రాష్ట్రాన్ని‌ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అడ్డగోలుగా ముక్కలు చేస్తుంటే మరో పక్క కాంగ్రెస్, టీడీపీ నాయకుల డ్రామాలు పతాకస్థాయికి చేరాయని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తాను విభజన వాదా? సమైక్య వాదా? లేక  ఏ వాదో ఎందుకు స్పష్టం చేయడంలేద?ని ప్రశ్నించారు.

వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ గతంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ మద్దతు ఇచ్చి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేదా? అని గట్టు అన్నారు. విప్‌ జారీ చేసి మరీ ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబు నాయుడు కాదా? అని నిలదీశారు. చంద్రబాబు, కిరణ్‌లు సోనియాకు రెండు చేతుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సోనియా కనుసన్నల్లోనే సీమాంధ్ర ఎంపీలు నడుస్తున్నారని గట్టు వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో మిగతా ఎంపీలు ఎందుకు సంతకం చేయలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో డ్రామాకు బదులు చంద్రబాబు ఇంటి ముందు ధర్నా ఎందుకు చేయడం లేదు అని గట్టు రామచంద్రరావు అడిగారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top