విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ

విజయవాడ:

 కృష్ణాజిల్లాలో పుష్కరాల్లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పరామర్శించారు. 

వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్ కుటుంబాన్ని వైయస్ జగన్ ఓదార్చారు. ఎంతో కష్టపడి చదివించామని, చేతికొచ్చిన కుమారుడు ఆదుకుంటాడని అనుకుంటే ఇలా జరిగిందని నగేష్ తల్లిదండ్రులు వైయస్ జగన్ వద్ద విలపించారు. అనంతరం గోపిరెడ్డి, లోకేష్ సాయి, హరగోపాల్, హరిగోపి కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాల అండగా ఉంటామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.  కృష్ణాజిల్లా నందిగామ చైతన్య డిగ్రీ కాలేజీలో బికాం ఫైనల్‌ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పుష్కర స్నానానికి వెళ్లి ప్రమాదంలో మరణించడం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. 

తాజా వీడియోలు

Back to Top