ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న అంబటి


హైదరాబాద్) సత్తెనపల్లి
టీడీపీ ఎమ్మెల్యే, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
చేయనున్నారు. అదే నియోజక వర్గం నుంచి వైయస్సార్సీపీ నుంచి పోటీ చేసిన పార్టీ
అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఈ ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల
ప్రధానాధికారి భన్వర్ లాల్ అపాయింట్ మెంట్ తీసుకొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు
సచివాలయంలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో కలవబోతున్నారు.

ఇటీవల ఒక టీవీ చానెల్ లో కు
ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడెల శివప్రసాద్ రావు కొన్ని వాస్తవాలు బయట పెట్టారు. గడచిన
ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం తాను రూ. 11.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు
వెల్లడించారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం రూ. 28 లక్షలకు మించి ఖర్చు
పెట్టకూడదు. అందుచేత ఎన్నికల సంఘం నియమావళి ని అతిక్రమించినట్లుగా ఫిర్యాదు
చేయనున్నారు. 

Back to Top