జగన్ ర్యాలీ.. విమానాశ్రయంలోనే కిరణ్

హైదరాబాద్ 24 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎలా ఉండబోతోందో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎన్నికలకు కొన్ని నెలల ముందే తెలిసొచ్చింది. మంగళవారం రాత్రి విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిరణ్ కు ఈ సంగతి అనుభవంలోకి వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన కొద్దిసేపు వేచి ఉండాల్సి వచ్చింది.  

బెయిలుపై విడుదలయిన శ్రీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెడుతున్న ర్యాలీ నత్తనడకన సాగుతుండడంతో, క్యాంప్ ఆఫీసుకు సీఎం కాన్వాయ్ ను పంపడానికి కొద్దిసేపు వేచి ఉండాల్సిందిగా పోలీసులు సీఎం రక్షణ సిబ్బందిని కోరారు.

వేలాదిమందితో సాగుతున్న ర్యాలీ మెల్లిగా వెడుతున్న కారణంగా సీఎం కాన్వాయ్ బయలుదేరితే ఎదురెదురుపడే అవకాశమున్నందున  విమానాశ్రయంలోనే కొద్దిసేపు వేచి ఉండాల్సిందిగా పోలీసులు ముఖ్యమంత్రిని కోరారు. ఇంతలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గంలో సీఎం కాన్వాయ్ వెళ్ళేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఆదరణ ఈ అంశంతో ముఖ్యమంత్రికి తెలిసి వచ్చింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top