సీఎం సీటులో ఉన్న కిరణ్‌కు సిగ్గుగా లేదా?

కాట్రేనికోన (తూ.గో.జిల్లా) :

నెల రోజుల వ్యవధిలో రెండు తుపానులు రావడమే కాక మరో భయంకరమైన తుపాను ముంచుకు వస్తున్న నేపథ్యంలో రైతులు నష్టపోతున్నా, వారికి రుణమాఫీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కాట్రేనికోనలో తుపాను బాధిత రైతులు, మత్స్యకారులతో మాట్లాడిన శ్రీ జగన్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.‌ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రాని ప్రభుత్వంలో రాష్ట్ర పౌరుడిగా ఉన్నందుకు తనకు సిగ్గుగా ఉందని శ్రీ జగన్ అన్నారు.‌ అలాంటిది ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎందుకు సిగ్గు అనిపించడం లేదని నిలదీశారు.
వరుస తుపాన్లతో రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం కనీసం కిలో బియ్యం, లీటర్ కిరోసి‌న్ ‌అయినా ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు తక్షణ సాయంగా ఇవ్వాలని‌ ప్రభుత్వాన్ని శ్రీ జగన్ డిమాండ్ చేశారు. వారికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి వెంటనే ఆదుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం స్పందించినా.. స్పందించకపోయినా నాలుగు నెలలు ఓపిక పడితే రాబోయే వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం‌ తుపాను బాధితులందరికీ అండగా ఉంటుందని శ్రీ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

Back to Top