వైఎస్ జగన్ ఉద్యమప్రస్థానం@2015

ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి నిరంతరం జనంలోనే ఉంటూ వారికి అండగా నిలిచిన ఈతరం ప్రజానాయకుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ప్రజలకు ఎక్కడ ఏ ఆపద వాటిల్లినా నేనున్నానంటూ వెళ్లి వారికి ఓ భరోసా కల్పించారు.  ధైర్యం నింపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను  ఎండగడుతూ...ప్రజాసమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నారు జననేత.  ప్రజలకు తోడుగా నిర్విరామంగా ఏడాదిపాటు వైఎస్ జగన్ ఎనలేని పోరాటాలు చేశారు . విద్యార్థులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలకు చేదోడువాదోడుగా ఉంటూ ప్రభుత్వంపై ఉద్యమించారు. దీక్షలు, ధర్నాలు, బంద్ లు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఏడాది కాలంలో జననేత వైఎస్ జగన్ చేపట్టిన జనదీక్షలపై స్పెషల్ రిపోర్ట్. 

దీక్షాదక్షుడు..వైఎస్ జగన్

రైతు దీక్ష‌: (31-01-15 నుంచి 01-02-15)- తణుకు
ఎన్నికల ముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు, చేనేత‌ల రుణాలు మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చాడు. తాను సీఎం కాగానే మొద‌టి సంత‌కం చేస్తాన‌ని హడావుడి చేశాడు.  అయితే అధికారంలోకి వ‌చ్చి ఏడాది గ‌డుస్తున్నా ఏ ఒక్క రైతు, మ‌హిళ‌, చేనేత‌ల రుణాలు పూర్తిగా మాఫీ చేయ‌లేదు. దీంతో ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గుంటూరు జిల్లా తణుకు ప్రాంతంలో... ఈ ఏడాది జ‌న‌వ‌రి 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేది వ‌ర‌కు రెండు రోజుల పాటు రైతు దీక్ష చేప‌ట్టారు. రైతుల పంట రుణాలు బేష‌ర‌త్తుగా మాఫీ చేయాల‌ని, డ్వాక్రా మ‌హిళ‌లు, చేనేత‌ల రుణాలు ఒకే సారి మాఫీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

స‌మ‌ర దీక్ష‌: (03-06-15 నుంచి 04-06-15)- మంగళగిరి
తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యిన ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. చంద్ర‌బాబు ఏడాది మోసాలను నిర‌సిస్తూ, ఇంకా నాలుగేళ్లు ఎలా భ‌రించాల‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఈ ఏడాది జూన్ 3, 4వ తేదిల్లో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో స‌మ‌ర దీక్ష త‌ల‌పెట్టారు. రైతుల‌ను వంచించార‌ని, డ్వాక్రా మ‌హిళ‌ల్ని మోస‌గించార‌ని, నిరుద్యోగుల‌ను ద‌గా చేశార‌ని జ‌న‌నేత ధ్వ‌జ‌మెత్తారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోయినా టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా కొన‌సాగుతుండ‌టాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. రాజ‌ధాని పేరిట విదేశి కంపెనీల కోసం బ‌ల‌వంతంగా భూములు లాక్కోవ‌డం దారుణ‌మ‌ని దీక్ష చేప‌ట్టారు.

ప్రత్యేక హోదా కోసం ధర్నా:(10-08-15)- ఢిల్లీ
రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని నాడు పార్ల‌మెంట్‌లో ప్రకటించారు. ఇందుకు అప్ప‌టి ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్‌, నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న వెంక‌య్య‌నాయుడు, చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇచ్చారు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాయి. అయితే ఈ రెండు పార్టీలు ఆంధ్ర‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలో ఇచ్చిన హామీల ప్ర‌కారం ఆంధ్ర ప్ర‌దేశ్‌కు సాయం చేయాల‌ని కోరుతూ ప్ర‌తి ప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిరాహార దీక్ష చేప‌ట్టారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. 

కొత్తమాజేరు జ్వరపీడితుల కోసం ధర్నా: (25-08-15) - మచిలీపట్నం
క్ర‌ిష్ణా జిల్లాలో విష‌ జ్వ‌రాల కార‌ణంగా అమాయ‌క‌ ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డుతుండ‌టంతో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చ‌లించారు. కొత్త‌మాజేరు జ్వ‌ర‌పీడితుల ప‌క్షానా జ‌న‌నేత ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.  2015 ఆగ‌స్టు 25న మ‌చిలీప‌ట్నంలో ధ‌ర్నా చేశారు. జ్వ‌ర‌పీడితుల‌కు స‌రైన వైద్యం అంద‌డం లేద‌ని మండిప‌డ్డారు. 

సీఆర్‌డీఏ కార్యాలయం ముందు ధర్నా: (26-08-2015)-  విజ‌య‌వాడ
రాజధాని భూసేకరణపై విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయం ముందు  ప్రజానాయకుడు వైఎస్ జగన్  ధ‌ర్నా చేప‌ట్టారు. ప‌చ్చ‌ని పొలాల‌ను విదేశీ కంపెనీల‌కు అప్ప‌గించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు య‌త్నించడంపై  అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రాజ‌ధాని పేరుతో రైతుల నుంచి బల‌వంతంగా భూములు లాక్కునేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా   విజ‌య‌వాడ‌లోని సీఆర్‌డీఏ కార్యాల‌యం ఎదుట 2015 ఆగ‌స్టు 26న జ‌గ‌న్ ధ‌ర్నా చేశారు. 

పొగాకు వేలం కేంద్రం దగ్గర ధర్నా:(30-09-15)- టంగుటూరు
పొగాకు రైతు సమస్యలపై టంగుటూరు పొగాకు వేలం కేంద్రం దగ్గర వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సెప్టెంబ‌ర్ 30, 2015న ధ‌ర్నా చేప‌ట్టారు. పొగాకుకు మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని, త‌డిసిన పొగాకును ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ దీక్ష: (7.10.15 నుంచి 13.10.15)- గుంటూరు
రాష్ట్ర ప్రజల భవిష్యత్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కు సంజీవని అయిన ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ చేయని పోరాటం లేదు. ఢిల్లీలో నిరాహార దీక్ష‌ల అనంత‌రం వైఎస్ జగన్  ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు ఉధృతం చేశారు. అన్ని మండ‌ల, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ  ఆధ్వ‌ర్యంలో బంద్ లు, ధర్నాలు, దీక్షలు, ర్యాలీలతో హోరెత్తించారు. అసెంబ్లీలో ప్రభుత్వం మెడలు వంచి హోదా తీర్మానం చేయించారు. ఐనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాకపోవడంతో  గుంటూరు జిల్లా తుళ్లూరులో... వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏడు రోజుల పాటు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లు చేప‌ట్టారు. ప్రభుత్వం కుట్ర పన్ని బలవంతంగా పోలీసులతో దీక్షను భగ్నం చేసింది. దొడ్డిదారిన అర్థరాత్రి పోలీసులను పంపి దీక్షను అడ్డుకుంది. 
Back to Top