వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తా

ప్రకాశం: చీరాల నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేస్తానని యడం బాలాజీ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దగ్గరనుంచి చూసి రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారన్నారు.  చీరాలలో ఏర్పాటు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో యడం బాలాజీ మాట్లాడుతూ..నాలుగేళ్లుగా నన్ను ఆదరిస్తూ..నాకు తోడుగా ఉన్నారని తెలిపారు. మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వమని కోరారు. ఈ నియోజకవర్గంలో పేద, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానని, చేనేత, మత్స్యకారులు, వస్త్రవ్యాపారులకు తోడుగా ఉంటానని చెప్పారు. గత ఎన్నికల్లో చెప్పాను, మళ్లీ చెబుతున్నాను..ఆమంచి కృష్ణమోహన్‌ను ఓడిచేంది నేనే అన్నారు. వైయస్‌ జగన్‌ వస్తున్నారు ప్లెక్సీలు కడుతున్నారని..ఖబడ్దారు ఆమాంచి..వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తానని చెబుతున్నాను. 
Back to Top