చిన్నారులకు పేరు పెట్టిన షర్మిల

వజ్రకరూరు:

వజ్రకరూరు మండలంలో సోమవారం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో షర్మిల ముగ్గురు చిన్నారులకు నామకరణం చేశారు. తట్రకల్లుకు చెందిన నాగరాజు, సునీత దంపతుల కుమారునికి జగన్ అని, శంకర్, ప్రవల్లిక కుమారునికి రాజన్న అని నామకరణం చేశారు. ధర్మపురికి చెందిన రాంజినేయరెడ్డి, పవిత్ర దంపతుల కుమార్తెకు సహనా అని పేరు పెట్టారు. తమ పిల్లలకు షర్మిల నామకరణం చేయడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Back to Top